Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
- ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత
- ఆస్పత్రిలో చికిత్స.. ఆస్ట్రేలియా టూర్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటి మమిత బైజు ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, ఒంటినొప్పితో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆమె ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మమిత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
మమిత బైజు ఈ వారం ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఓనం వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. దీంతో సెప్టెంబర్ 5న జరగాల్సిన Lendaxis Clyde Onam 2026 కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ వేడుకకు మమిత ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.
Also Read
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ఆస్పత్రి నుంచి మమిత హెల్త్ అప్డేట్
ఆస్ట్రేలియాలో మమితను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులను ఉద్దేశించి క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మమిత తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తూ ముందుగా నిర్ణయించిన తేదీన నేను అక్కడికి రాలేకపోతున్నాను. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. ఎలాగైనా రావాలని అనుకున్నాను. కానీ వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు” అని మమిత తెలిపారు. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోవడం తనకు బాధగా ఉందని ఆమె చెప్పారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవడం తప్పనిసరి అయిందని వివరించారు.
వాయిదా పడిన ఓనం వేడుకలు
క్లైడ్ మలయాళీ అసోసియేషన్ గతంలోనే మమిత బైజును సెలబ్రిటీ గెస్ట్‌గా ప్రకటించింది. ఆమె పాల్గొనే ఓనం వేడుకల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే మమిత ప్రయాణం రద్దు కావడంతో.. ముందుగా నిర్ణయించిన తేదీన కార్యక్రమాన్ని నిర్వహించకుండా వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మమిత బృందం, కార్యక్రమం నిర్వహించాల్సిన వేదిక నిర్వాహకులతో కలిసి కొత్త తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
త్వరలో కలుస్తా
తన కోసం ఎదురుచూస్తున్న నిర్వాహకులు, అభిమానులకు మమిత క్షమాపణలు తెలిపారు. త్వరలోనే క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సభ్యులను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు మమిత బైజు చెప్పారు. “నేను వచ్చి క్లైడ్ కుటుంబ సభ్యులను కలవాలని ఎంతో కోరుకుంటున్నాను. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే నేను ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరో సందర్భంలో తప్పకుండా కలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను” అని మమిత బైజు తెలిపారు.

తాజావార్తలు
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!