Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dear You: ఒక సినిమా భారీ హిట్ కొట్టాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్స్ మాత్రమే అవసరం లేదని మరోసారి రుజువవుతోంది. కంటెంట్ ఉన్న కథలను తక్కువ బడ్జెట్‌తో రూపొందినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే ‘హనుమాన్’ వంటి సినిమాలు తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో తక్కువ బడ్జెట్ మూవీ ఏకంగా రూ.2,000 కోట్ల మార్క్‌ను దాటి అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. చైనాలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా త్వరలో అమెరికాలో కూడా రిలీజ్ కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏది? అంత భారీ వసూళ్లు సాధించడానికి కారణమేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ సినిమా చైనీస్ మూవీ పేరు ‘డియర్ యూ’. హాంగ్‌చున్ లాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 ఏప్రిల్ 30న చైనా థియేటర్లలో విడుదలైంది. సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ.132 కోట్లకు సమానం. అయితే పెట్టుబడితో పోలిస్తే ఈ సినిమా సాధించిన వసూళ్లు ఊహించని స్థాయిలో ఉన్నాయి. చైనా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 300 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2,849 కోట్లుగా ఉంటుంది.
Also Read
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇప్పుడు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2026లో ఊహించని బాక్సాఫీస్ విజయాల్లో ‘డియర్ యూ’ ఒకటిగా నిలవడంతో ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినీ ప్రేక్షకులు. చైనాలో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో అక్కడి మార్కెట్‌ను దాటి ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో కూడా హల్చల్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న ‘డియర్ యూ’ ఉత్తర అమెరికాలో రిలీజ్ కాబోతోంది.
‘డియర్ యూ’ అనే టైటిల్‌కు చైనీస్ భాషలో అమ్మమ్మకు ప్రేమలేఖ అనే అర్థం వస్తుంది. పేరు వింటేనే ఇది కుటుంబం, అనుబంధం చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతుంది. ‘డియర్ యూ’ (Dear You) అనేది వలసల నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అప్పులు, ఫ్యామిలీ కష్టాల ఊబిలో కూరుకుపోయిన చైనాకు చెందిన ఒక వ్యక్తి, కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు థాయ్‌లాండ్ ప్రయాణమవడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడకు వెళ్ళిన అతనికి దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం తెలుస్తుంది. మరి ఆ రహస్యం ఏమిటి? ఫ్యామిలీ కష్టాల నుంచి అతను ఎలా బయట పడ్డాడు ? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ కథ సాగుతుంది.
రూ.132 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.2,849 కోట్లకు పైగా వసూలు చేసిన ‘డియర్ యూ’ ఇప్పుడు కేవలం చైనా బాక్సాఫీస్ హిట్ గానే కాకుండా వరల్డ్ మార్కెట్ లో కూడా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. మరిన్ని బాక్సాఫీస్ వసూళ్లు దిశగా పయనిస్తోంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగ బంధాలను కథగా మలచిన ఈ సినిమా అమెరికాలో కూడా మంచి స్పందన తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.
- Tags
- cinema
తాజావార్తలు
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!