బాలీవుడ్ సూపర్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. వివాహం తర్వాత విక్కీ, కత్రినా ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ ఇండియాలో పంచుకుంటున్నారు. తాజాగా కత్రినా తన మెహందీ, బ్యాంగిల్స్ వేసుకున్న అందమైన చేతులను చూపిస్తూ పిక్ షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారగా…దానిపై ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది కత్రినా మెహందీలో విక్కీ పేరు కోసం వెతుకుతున్నారు. కానీ అందులో విక్కీ పేరు లేదు. కత్రినా తన మెహందీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కత్రినా ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది లైక్ చేసారు.
Read Also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
కత్రినా, విక్కీ హనీమూన్ తరువాత తిరిగి ముంబైకి వచ్చారు. ఇద్దరూ హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. కత్రినా అత్తారింట్లో మొదటి రోజు ఆమె అత్తమామలకు హాల్వా చేసి పెట్టింది. ఇక ముంబైకి వచ్చిన తర్వాత విక్కీ కౌశల్ తిరిగి పనిలో పడిపోయాడు. షూటింగ్‌కి వెళుతున్న సమయంలో తన ఫొటోను షేర్ చేస్తూ “మొదట కాఫీ ఆపై క్లాప్‌బోర్డ్” అంటూ కామెంట్ చేశాడు. అదే సమయంలో కత్రినా కూడా త్వరలో సల్మాన్ ఖాన్‌తో “టైగర్ 3” షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది.