బాలీవుడ్ లో ఆర్. బాల్కీ సినిమాలంటే స్పెషల్ గా చూస్తారు. ‘పా’ చిత్రంతో మొదలు పెట్టి ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ తో జనం ముందుకొస్తుంటాడు. అలాగే, బాల్కీ ప్రతీ సినిమాలోనూ బచ్చన్ సాబ్ తప్పక ఉంటాడు. రాబోయే చిత్రంలో కూడా అదే జరగబోతోంది. బాల్కీ, బచ్చన్ కాంబినేషన్ లో మరో సినిమా సిద్ధం అవుతోంది. అయితే, ఈసారి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించటం లేదట. కత్రీనా కైఫ్ క్యారెక్టర్ చుట్టూ కథ అల్లుకుంటుందట!
కత్రీనా కైఫ్ ఇప్పటి వరకూ చాలా రకాల సినిమాలు చేసింది. బాలీవుడ్ లో టాప్ హీరోలందరితో సూపర్ హిట్స్ అందించింది. కానీ, ఆమె కెరీర్ లో ఒకే ఒక్క లోటు… హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! ఇంత వరకూ క్యాట్ తన ఓన్ ఇమేజ్ తో సినిమాను బాక్సాఫీస్ వద్దకు తీసుకురాలేదు. కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన లైమ్ లైట్ షేర్ చేసుకుంది. బాల్కీ నెక్ట్స్ మూవీతో కత్రీనా నిజంగానే పెద్ద రిస్క్ తీసుకోబోతోంది…
ఆర్. బాల్కీ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆయన నటన వచ్చిన బ్యూటీస్ నే ప్రిఫర్ చేస్తుంటాడు. కత్రీనా ఏమో ఇప్పటి వరకూ అందంతో ఆకట్టుకుంది తప్ప అభినయంతో పెద్దగా సంచలనాలు సృష్టించలేదు. కెరీర్ మొదట్లో కంటే ఇప్పుడు ఆమె యాక్టింగ్ చాలా బెటర్ గా మారింది. అందులో సందేహం లేనప్పటికీ బాల్కీ సినిమాలో సత్తా చాటడం అంటే పెద్ద సవాలే! అందుకు కత్రీనా సై అంటోందట! పూర్తిగా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ గా సాగే స్టోరీతో బాల్కీ నెక్ట్స్ మూవీ ఉంటుందని బాలీవుడ్ టాక్….
ప్లాస్టిక్ బ్యూటీ అన్న అపఖ్యాతితో మొదలైన కత్రీనా కైఫ్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆమెతో నటించటానికి హీరోలు, చిత్రాలు రూపొందించటానికి దర్శకులు క్యూ కడుతున్నారు. చూడాలి మరి, బాల్కీ మూవీతో బాలీవుడ్ భామ తనలోని నటనని కూడా ఏ స్థాయిలో వెలికితీస్తుందో మరి…