కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు, సంగీత స్వరకర్త కతిర్, ఏఆర్ రెహమాన్ 19 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కతిర్ తొలి చిత్రం “ఇదయం (హృదయం)”, అంతకుముందు విడుదలైన “నాన్ లవ్ ట్రాక్” మినహా ఆయన అన్ని సినిమాలకు రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పుడు కతిర్ నెక్స్ట్ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ కోసం సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేయనున్నారు.
Read Also : సూర్యకు షాకిచ్చిన హైకోర్టు… పన్నులు చెల్లించాల్సిందే !
కతిర్ కొత్త చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత ఎన్ రంగనాథన్ కుమారుడు కిషోర్ నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్‌కె ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చెన్నై, ముంబై, బెంగళూరుతో పాటు విదేశాలలో జరుగుతుంది. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కతీర్, రెహమాన్ కలిసి 90వ దశకంలో ఐకానిక్ మూవీ “కాదల్ దేశం (ప్రేమ దేశం)”, “కథలార్ దినం (ప్రేమికుల రోజు)”, 2002లో “కాదల్ వైరస్” వంటి సినిమాలకు టైంలెస్ ఆడియో ఆల్బమ్‌లను ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో వస్తుండడం ఆసక్తికరంగా మారింది.