Kathika Deepam: బుల్లితెర అనగానే టక్కున గుర్తొచ్చే సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం మాత్రమే. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ ఈ సీరియల్ కు పూజలు చేసిన అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే పాత్రలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వంటలక్క ఎంత ఫేమస్ అయ్యిందంటే.. సీరియల్ చేస్తున్నప్పుడే ఆమెకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కూడా వచ్చేసింది. సీరియల్ లో ఆమె ఎలాంటి మూడ్ లో ఉంటే మహిళలు అలాంటి మూడ్ లోకి వెళ్ళిపోయేవారు. మోనిత బయట కనిపిస్తే చంపేస్తామని కక్ష కట్టిన ఆడవారు కూడా ఉన్నారు. అంతటి పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ ఇది. వంటలక్కకు ఏదైనా అయితే రక్తాలు చిందుతాయ్ అని కుర్రకారు కూడా ఈ సీరియల్ పై మమకారం చూపించాయి. అలాంటి సీరియల్ ఎండ్ కాబోతోంది.
ఎన్నో ఏళ్లుగా రేటింగ్ లో టాప్ లో ఉన్న ఈ సీరియల్ ను ఎండ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో కార్తీక దీపం ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. సీరియల్స్ నచ్చనివారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సీరియల్ చాలా రసవత్తరంగా సాగేది. ఆ తరువాత కథలో చాలా మార్పులు రావడం దీప బయటికి వెళ్లిపోవడం.. పిల్లలను పెద్దవారిగా చూపించడం.. అంతా చిరాకుగా అనిపించిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక రేటింగ్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో భయపడ్డ మేకర్స్ వెంటనే కార్తిక్, దీపను తీసుకొచ్చి కొత్త కథకు నాంది పలికారు. అందులో కూడా దీపకు కష్టాలు తప్పలేదు. ఆమెకు గుండెపోటు రావడం, చనిపోతుందని చెప్పడం, మోనిత ప్లాన్స్ తోనే సీరియల్ అంతా సాగుతోంది కానీ, కొంచెం కూడా ఎంటర్ టైన్ చేయడంలేదని అనుకున్న అభిమానులు సీరియల్ చూడడం మానేశారు. దీంతో చేసేది లేక కార్తీక దీపంకు శుభం కార్డు పలికారు. ఇక ఈ సీరియల్ ప్లేస్ లో బ్రహ్మముడి అనే కొత్త సీరియల్ రానున్నట్లు తెలిపారు.
చెల్లెలి కాపురం, గుప్పెడంత మనసు లాంటి హిట్ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన కుమార్.. ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సీరియల్ కూడా మంచి కుటుంబ కథా చిత్రమని చెప్పుకొస్తున్నారు. ప్రోమోను బట్టి చూస్తే.. ముగ్గురు అన్నదమ్ములు.. ముగ్గురు వ్యక్తిత్వాలు వేరు..వారి కోసమే పుట్టినట్టు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఆడపిల్లలకు పెళ్లి చేసి భారం దించుకోవాలనుకొనే తల్లి.. వేరు వేరు మనస్తత్వాలు కలిగిన ఆ మూడు జంటలు ఎలా కలిశాయి. ఒక పెద్దింటి కుటుంబానికి తన ముగ్గురు కూతుళ్లను.. ఆ తల్లి, కోడళ్ళుగా ఎలా పంపింది. ఇష్టం లేకుండా ముడిపడిన ఈ బ్రహ్మముడి చివరికి ఎక్కడకు చేరింది అనేది కథగా తెలుస్తోంది. ఇక ఈ సీరియల్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన మానస్ హీరోగా చేస్తుండగా దీపికా అనే కొత్త హీరోయిన్ పరిచయమవుతుంది. ఇక హమీదా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సీరియల్ కార్తీక దీపం ప్లేస్ లో రానుంది. మరి కార్తీక దీపం ఫ్యాన్స్ ఈ సీరియల్ ను ఆదరిస్తారో లేదో చూడాలి.