Kathika Deepam: బుల్లితెర అనగానే టక్కున గుర్తొచ్చే సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం మాత్రమే. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ ఈ సీరియల్ కు పూజలు చేసిన అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే పాత్రలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన రోజులు కూడా ఉన్నాయి.