Katha Venuka Katha Getting Response in ETV Win: ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది. విడుదలైన కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్నారు. సునీల్, యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య… వైవిధ్యమైన వివిధ రకాల కథ… కథనాలతో ప్రేక్షకుల్ని అనుక్షణం థ్రిల్ కు గురి చేశారని చెప్పొచ్చు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది.
Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్
దర్శకుడు అయ్యి… తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్… ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో… అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. అందుకు తగ్గట్టుగా విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. తమ సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్ర కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చు వెనుకాడలేదని అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారని అన్నారు. ఇది మాకు ఎంతో బూస్టప్ నిచ్చిందన్న ఆయన ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని అన్నారు.