Karthikeya : కార్తికేయ కొత్త సినిమా ‘బెదురులంక 2012’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తికేయ, నేహా శెట్టి జంటగా ‘కలర్ ఫొటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ నిర్ణయించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ బెన్నీ తీస్తున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 21 కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ‘కార్తికేయకు పుట్టినరోజు న టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. చివరి షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలను అందించారు. ‘స్వర్గీయ’ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఓ పాట రాశారు’ అన్నారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. ఊరు నేపథ్యంలో వినోదంతో పాటు మానవ భావోద్వేగాలతో కలబోసిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. కంటెంట్ తో పాటు కడుపుబ్బ నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడమా? మనసుకు నచ్చినట్టు బతకడమా? అనేది పాయింట్ తో తీస్తున్నాం’ అని చెప్పారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రధారులు.
Also Read
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!