Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరి చూపులు తనవైపు ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్-2. మొదటి పార్టు సర్దార్ మంచి హిట్ కావడంతో రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు పీఎస్ మిత్రన్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీంతో మూవీ కోసం పనిచేసిన స్టాఫ్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు మేకర్స్. బంతి భోజనంలా అందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టారు. హీరో కార్తీ స్వయంగా భోజనాలు వడ్డించారు.
Read Also : Bhagya Sri : పాపం భాగ్య శ్రీ.. ఆంధ్రాకింగే దిక్కు..
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హీరో స్వయంగా తమ వద్దకు వచ్చి భోజనాలు వడ్డించడంతో స్టాఫ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయినా సింపుల్ గా ఉంటూ అందరితో కలిసిపోతారని కార్తీపై ప్రశంసలు కురుస్తున్నాయి. అచ్చ తెలుగులో పాట పాడినా.. రోడ్డు మీద అందరితో కలిసి డ్యాన్స్ చేసినా కార్తీ స్పెషాలిటీ అది. కొన్ని సార్లు తాను హీరో అనే విషయాన్ని పక్కన పెట్టేసి అందరితో కలిసిపోతుంటారు. సింపుల్ లివింగ్ కు అలవాటు పడటం కార్తీకి ఇష్టం. ఇక ప్రస్తుతం సర్దార్-2 లో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్ గా చేస్తున్నారు. మాళవికమోహన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Also : Sonusood : సోనూసూద్ గొప్ప మనసు.. మరో కీలక ప్రకటన..
Unseen 🚨😍
Our man himself served briyani
for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl #Karthi #MrVersatileKarthi pic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025