Movie Ticket Rates : టాలీవుడ్ సినిమాలకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల టికెట్ రేట్లను చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణలో పుష్ప-2 కంటే ముందు ఇష్టారీతిన రేట్లు పెంచుకునేవాళ్లు. సినిమా బడ్జెట్ ను బట్టి మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేటు మీద రూ.295 నుంచి రూ.350 వరకు పెంచుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో 140 వరకు పెంచుకుంటున్నారు. అటు ఏపీలో మరీ అంత కాకపోయినా.. మల్టీ ప్లెక్సుల్లో రూ.180, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర సినిమాను బట్టి రూ.112 నుంచి 150 మధ్య ఉంటోంది.
Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?
ఇలాంటి పద్ధతి మొన్నటి వరకు కర్ణాటకలో ఉండేది. కానీ తాజాగా కర్ణాటక ప్రభుత్వం అన్ని థియేటర్లలో ప్రతి సినిమాకు రూ.200లకు మించి టికెట్ రేట్ ఉండొద్దని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే పెరిగిన టికెట్ రేట్లు ఆడియెన్స్ ను థియేటర్లకు దూరం చేసేసింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే రూ.1000 వరకు పెట్టాల్సిందే. ఇంక థియేటర్ లో పాప్ కార్న్, తినే ఆహారాలు, కూల్ డ్రింక్ ల రేట్ల సంగతి అసలే చెప్పక్కర్లేదు. అందుకే ఈ రేట్లు పెరిగినప్పటి నుంచే ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గిపోయింది. తెలంగాణ, ఏపీలో ఇదే పరిస్థితి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరలోనే ఏపీ, తెలంగాణలో కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టికెట్ రేట్లపై పెద్ద హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా పదే పదే మాట్లాడుతున్నారు.
దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి కూడా చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లను పెంచడం ఆపేశారు. కానీ మళ్లీ స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ కర్ణాటక తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో కూడా అలాంటి జీవో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో వస్తే ఆటోమేటిక్ గా ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇది ఒక రకంగా సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేసే అవకాశం ఉంది. అది కూడా నిర్మాతలకు లాభమే. కానీ సినిమాలకు బడ్జెట్ ను తగ్గించుకుంటే లాభాలు ఊహించినదానికంటే ఎక్కువే ఉంటాయి.
Read Also : PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!