బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక చెల్లి కరీనా కపూర్ తో పాటు కరిష్మా చేసే అల్లరి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అందరికి తెలిసిందే. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహమాడింది.
ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2016 లో విడాకులు తీసుకొని ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఇక విడాకుల అనంతరం కరిష్మా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు గుప్పమంటున్న విషయం విదితమే. ఇక తాజాగా ఆమె రెండో పెళ్లిపై నోరు విప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానిలతో చిట్ చాట్ సెషన్ నిర్వహించగా ఒక అభిమాని ” మీరు రెండో పెళ్లి చేసుకుంటారా” అని అడుగగా వెంటనే తడుముకోకుండా ” చేసుకొంటానేమో ” అని చెప్పుకొచ్చింది. దీంతో త్వరలోనే ఈ భామ రెండో పెళ్లి చేసుకోనున్నదని క్లారిటీ వచ్చేసింది. మరి కరిష్మా చేసుకోబోయే వ్యక్తి సినిమా రంగానికి చెందినవాడో .. వ్యాపారరంగానికి చెందినవాడో చూడాలి .