Karate Kalyani : నటి హేహకు, కరాటే కల్యాణికి మధ్య వార్ నడుస్తోది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. మొన్న హేమ లాయర్ ద్వారా కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రితో పాటు మరికొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు పంపించింది. తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ రూ.5కోట్ల దావా వేసింది. తాజాగా ఈ నోటీసులపై కరాటే కల్యాణి స్పందించింది. హేమ గురించి తాను ఎన్నడూ తప్పుడు ప్రచారాలు చేయలేదని తెలిపింది. హేమ తనను చాలా సార్లు కించపరుస్తూ తిట్టేదని.. తనను ఎన్నో సార్లు అవమానించింది అంటూ తెలిపింది.
Read Also : Mark Shankar: పవన్ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, రోజా..
‘నేను న్యూస్ ఛానెళ్లలో వచ్చిందే చెప్పాను. బెంగుళూరు రేవ్ పార్టీలో హేహ దొరికిందని చాలా న్యూస్ ఛానెల్స్ లో వచ్చింది. నేను అదే చెప్పాను. అంతకు మించి వేరే ఏం చెప్పలేదు. దానికి నా మీద ఆమె కేసు పెట్టింది. ముందు నన్ను తిట్టినందుకు ఆమె మీద కేసు పెట్టాలి కదా. మీడియా మీద ఎందుకు కేసు పెట్టట్లేదు. ఎందుకంటే ఆమె మీడియా అంటే భయపడుతోంది. ఇలాంటి నోటీసులకు నేను భయపడను. ఎక్కడికైనా వచ్చి సమాధానం చెప్తాను’ అంటూ తెలిపింది. హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయినప్పుడు తనపై కరాటే కల్యాణి తప్పుడు ప్రచారం చేసిందంటూ హేహ చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.