కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో వరుణ్ ధావన్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరుణ్ యంగ్ హీరోలలో డిమాండ్ ఉన్న నటుడు. తాజాగా అతని మేనకోడలు అంజినీ ధావన్ కూడా కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా కథక్, జాజ్ వంటి పాశ్చాత్య, క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇక అమ్మడి అరంగేట్రం కోసం నలుగరైదుగురు కర్చీఫ్ వేసినా సుముఖత చూపలేదట. వరుణ్ ధావన్ లాగా తను కూడా కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట. అంజినీ ధావన్ కి సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మాల్దీవులు వెళ్ళి అక్కడ తన ఎక్స్పో జింగ్ తో హీట్ పెంచింది. ఇప్పటికే అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడు షేర్ చేసే పిక్స్, వీడియోలకు భారీ లైకింగ్ లు వస్తున్నాయి. వరుణ్ తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లోఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందులో నటించి ఆ ముగ్గురు బాలీవుడ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. మరి అంజనీ సైతం వారి బాటలోనే ప్రజాదరణ పొందుతుందేమో చూడాలి.