కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబలే, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మనవడు అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ‘యువ’ అనే సినిమాచేస్తోంది. పునీత్ రాజ్ కుమార్ కి సూపర్ హిట్స్, యష్ ని సూపర్ స్టార్ ని చేసిన రైటర్-డైరెక్టర్ సంతోష్ ఆనంద్ దర్శకత్వంలో ‘యువ’ సినిమా తెరకెక్కుతోంది.
రీసెంట్ గా ఒక వీడియోతో యువ రాజ్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేసిన మేకర్స్, ఆ వీడియోలోనే ‘యువ’ మూవీ టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యువ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. టైటిల్ టీజర్ కి అజ్నీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెమండస్ గా ఉంది. ఇటీవలే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో యువ రాజ్ కుమార్ పక్కన హీరోయిన్ గా కాంతర ఫేమ్ సప్తమీ గౌడని ఫైనల్ చేసారు. ఈరోజు సప్తమీ గౌడ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ ‘హ్యాపీ బర్త్ డే సిరి’ అంటూ సప్తమీ గౌండ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ‘యువ’ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరి యువ సినిమాతో యువ రాజ్ కుమార్ కి పాన్ ఇండియా రేంజ్ డెబ్యు దొరుకుతుందా? హోంబలే బ్రాండ్ వేల్యూతో రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త స్టార్ హీరో పుట్టుకొస్తాడా అనేది చూడాలి.