Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ టైమ్ లో మూవీ టీమ్ సుదీర్ఘ నోట్ రిలీజ్ చేసింది. ఇందులో కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. కన్నప్ప సినిమాను చూసిన తర్వాత మాత్రమే స్పందించాలని.. సినిమాను కించపరిచేలా వ్యవహరించినా.. మోహన్ బాబు, మంచు విష్ణు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరించినా సైబర్ క్రైమ్, పోలీస్, లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది.
Read Also : ShraddhaDas : శ్రద్దగా, పద్దతిగా.. నడుమందాలు చూపిస్తున్న శ్రద్దా దాస్
కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని.. ఏ మాత్రం తేడాగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని చెప్పింది. హైకోర్టు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. కాబట్టి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసి సినిమాను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది మూవీ టీమ్.
ఈ నోట్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో కన్నప్ప టీజర్ వచ్చినప్పుడు భారీగా ట్రోల్స్ నడిచాయి. కానీ ఇప్పుడు అలాంటివి జరగకుండా మూవీ టీమ్ జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది. సినిమాకు భారీ బడ్జెట్ పెట్టిన క్రమంలో.. ఏ మాత్రం తేడా వచ్చినా కలెక్షన్లపై దెబ్బపడుతుందనే నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also : Nikhil : సమాజం పట్ల తన వంతు బాధ్యతగా హీరో నిఖిల్