Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కన్నప్ప సినిమా కలెక్షన్లు ఎంత అనే దాని గురించే చర్చ జరుగుతోంది. మూవీ మొదటి రోజు మొదటి రోజు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు నాటనే ఎక్కువగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రెండో రోజు కూడా పర్వాలేదనిపించుకుంది.
Read Also : SHine Tom Chaco : రోడ్డు మీద కూర్చుని ఏడ్చాను.. దసరా విలన్ ఎమోషనల్..
అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.16.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. సోమవారం నాటికి కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ను చూడటానికే ఎక్కువ మంది థియేటర్లకు వస్తున్నారని మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు. థియేటర్లలో కుబేర, కన్నప్ప మూవీలు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. నిన్న కన్నప్ప టీమ్ థాంక్స్ మీట్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు చెప్పేసింది. మోహన్ బాబు చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రలో నటించారంటూ ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా చివరి గంట సేపు సినిమా మరో లెవల్ లో ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also : Surya : వెకేషన్ లో స్టార్ హీరో, హీరోయిన్