2025 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే రిలీజ్ డేట్ పై కసరత్తులు చేస్తున్నారు మూవీ మేకర్స్. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అలాగే సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అయిన దసరాను కూడా టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకైతే దసరాకు ఒక్క సినిమా కూడా అఫిషీయల్‌గా డేట్ లాక్ చేయలేదు. దసరా బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర లాంటి సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే… మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ మంచు విష్ణు మాత్రం దసరాకు వచ్చేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి హింట్ ఇవ్వలేదు కాబట్టి కన్నప్ప రిలీజ్ డేట్ లాక్ అయ్యింది అనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే.
ఇదిలా ఉంటే కన్నప్ప… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశారు మేకర్స్. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో… మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా శివుడిగా కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి మూడో వారంలో ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్‌లోకి జాయిన్ కాబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి కానీ లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ షెడ్యూల్ మరింత డిలే అవనుందట. ముందుగా ఈ నెలలోనే మళ్లీ న్యూజిల్యాండ్ వెళ్లి అక్కడ దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ చేయడానికి కన్నప్ప టీమ్ రెడీ అవుతోంది. ఈ న్యూజిల్యాండ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి అప్పుడు ప్రభాస్ పార్ట్ ని షూట్ చేస్తారట.