కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. మఫ్టీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శివన్న “భైరతి రణగళ్’ సినిమా శివరాత్రి కానుకగా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క సినిమా అనౌన్స్మెంట్ తో శివన్న ముగ్గురు హీరోల అభిమానులకి షాక్ ఇచ్చాడు. మఫ్టీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు నర్తన్, ప్రశాంత్ నీల్ శిష్యుడు. అందుకే నర్తన్ టేకింగ్ లో ప్రశాంత్ నీల్ కనిపిస్తాడు. మఫ్టీ సినిమాలో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి అందుకే నర్తన్ కి డిమాండ్ ఎక్కువ. నర్తన్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది అనే వార్తలు చాలా వైరల్ అయ్యాయి. గౌతమ్ తిన్నునూరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో, ఆ ప్లేస్ లో నర్తన్ ప్రాజెక్ట్ ‘RC 16’గా సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత నర్తన్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అనే వార్తలు కొన్ని రోజులు వినిపించాయి కానీ విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన గౌతమ్ తిన్నునూరి కథని ఓకే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ విషయంలో నర్తన్ పేరు తెలుగు ఆడియన్స్ లో బాగానే నానింది.
తెలుగు హీరోలు మాత్రమే కాదు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యష్ కూడా నర్తన్ ఒక ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు అని ఇండియన్ మీడియా మొత్తం కథనాలు ప్రచురించింది. ప్రశాంత్ నీల్ తో KGF చేసిన తర్వాత యష్, తనకి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని అలానే నిలబెట్టుకోవాలి అంటే ప్రశాంత్ నీల్ అంత ఇంపాక్ట్ చూపించే దర్శకుడితోనే వర్క్ చెయ్యాలి. అందుకే యష్, ప్రశాంత్ నీల్ శిష్యుడు అయిన నర్తన్ సినిమా చేస్తున్నాడు అని ఏవేవో లెక్కలు వేసి ఆర్టికల్స్ రాశారు. ఈ వార్తలన్నింటినీ కేవలం రూమర్స్ గా మార్చేస్తూ… నర్తన్, శివన్నతో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి ‘భైరతి రణగళ్’ సినిమాతో నర్తన్-శివన్నలు మరో సాలిడ్ హిట్ కొట్టడం గ్యారెంటీ. భైరతి రణగళ్ అనౌన్స్మెంట్ తో నర్తన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వచ్చే రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడింది. మరి రామ్ చరణ్ ‘RC 16’ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది చూడాలి.