Chetan Kumar: హిందుత్వపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. జైలుపాలయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannada Actor Chetan Kumar Ahimsa Arrested For Objectionable Tweet On Hindutva: చేతన్ అహింసాగా పాపులారిటీ పొందిన ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్ తాజాగా కటకటాలపాలయ్యాడు. హిందుత్వపై అతడు చేసిన వివాదాస్పద ట్వీట్లే అందుకు కారణం. స్వయాన హిందువైన అతడు.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్లు చేశాడు. రాముడు, టిప్పు సుల్తాన్, బాబ్రీ మసీదులపై మనకు చెప్పిన మాటలన్నీ అబద్ధమంటూ.. హిందూ మతాన్ని, హిందువుల మత విశ్వాసాల్ని దెబ్బతీసే అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో.. పలు హిందూ సంఘాలు అతనిపై తీవ్రస్థాయిలో మండపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
IND vs AUS 3rd ODI : సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. కుల్దీప్ యాదవ్‌పై సీరియస్
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
అసలు చేతన్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. ‘‘హిందుత్వం అబద్ధాలపై నిర్మించబడింది. సావర్కర్: రావణుడ్ని రాముడు ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చాక భారతదేశ జాతి ప్రారంభమైందనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది కూడా ఒక అబద్ధమే. హిందుత్వను సత్యం ద్వారా ఓడించవచ్చు – సత్యమే సమానత్వం’’. ఈ విధంగా చేతన్ చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడం, హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, అతడ్ని అరెస్ట్ చేశారు. హిందూ సంఘాలు అతనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కులాలు, మతాల మధ్య శతృత్వం రగిల్చేలా చేతన్ ట్వీట్ ఉందంటూ అతనిపై విరుచుకుపడ్డారు. చేతన్ కుమార్ చేసిన ట్వీట్‌పై హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో చేతన్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం
కాగా.. చేతన్ కుమార్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇతడు చాలాసార్లు తన తీరుతో, వ్యాఖ్యలతో ఎన్నో వివాదాలకు తెరలేపాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్‌పై అతడు అభ్యంతకర కామెంట్స్ చేశాడు. దీంతో.. హైకోర్టు జడ్జ్ మీద వ్యాఖ్యలు చేసినందుకు అతడ్ని అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే జైలు నుంచి విడుదల అయ్యాడు. ఇప్పుడు ఈ కొత్త వివాదం.. అతని మెడకు ఎలా చుట్టుకుంటుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!