Suriya: వీరుడొచ్చే వేళయ్యింది… కంగువా ఆగమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 స్టార్టింగ్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం సూర్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న కంగువా సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF సినిమాలు సౌత్ నుంచి రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకి పైగా రాబట్టాయి.
సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ మొదటి సినిమా కాబట్టి కోలీవుడ్ నుంచి వచ్చే మొదటి వెయ్యి కోట్ల మూవీ ఇదే అవుతుందని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆ రేంజ్ అంచనాలని మైంటైన్ చేస్తున్న కంగువా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లు ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కంగువా ప్రోమో కోసం సూర్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కంగువా ప్రోమోని జులై 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ సూర్య ఫేస్ రివీల్ చెయ్యకుండా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. టోన్డ్ షోల్డర్ తో సూర్య పర్ఫెక్ట్ వారియర్ లుక్ లో ఉన్నాడు. సూర్య బర్త్ డే రోజున కంగువా ప్రోమోని రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ లు సూపర్ బజ్ క్రియేట్ చేసాయి కాబట్టి కంగువా ప్రోమో కూడా అదే రేంజులో కట్ చేస్తే చాలు, ప్రాజెక్ట్ పై హైప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది.
Also Read
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/townT6PTqr
— UV Creations (@UV_Creations) July 20, 2023
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!