Kangana Ranaut : ఆరేళ్ళకే లైంగిక వేధింపులు… క్వీన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘లాక్ అప్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా జడ్జిమెంట్ డే స్పెషల్‌లో మునావర్ ఫరూఖీ అనే కంటెస్టెంట్ మాట్లాడుతూ “నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగికంగా వేధించారు. అదికూడా చిన్నతనంలో… ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ దారుణం 11 ఏళ్ళు వచ్చే వరకు సాగింది. అంటే దాదాపుగా ఐదేళ్లు… కానీ చిన్న పిల్లాడిని అవ్వడం వల్ల అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాను. ఒకరోజు అతను హద్దు దాటడంతో దీన్ని ఇక్కడే ఆపడం మంచిది అన్పించింది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోరని భావించి పెద్దవాళ్లకు చెప్పలేదు” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ విషయాన్ని విన్న కంగనా తన జీవితంలో కూడా జరిగిన అలాంటి దారుణమైన సంఘటనను వెల్లడించింది. ప్రతి సంవత్సరం పిల్లలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటారని, దానిని హైలైట్ చేయడానికి లేదా చర్చించడానికి ఎప్పుడూ తగిన బహిరంగ వేదిక లభించదు అంటూ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. కంగనా మాట్లాడుతూ “నేను దాదాపు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు మా ఊరిలో నాకంటే కొంచెం పెద్దవాడైన ఒక వ్యక్తి నన్ను అభ్యంతరకంగా తాకేవారు. కానీ ఆ సమయంలో అతని ఉద్దేశం నాకు అర్థం కాలేదు. మమ్మల్ని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడు, ఒళ్ళంతా తడిమేవాడు” అంటూ ఎవరూ ఊహించని విషయాన్ని వెల్లడించింది. ఇక మునావర్‌ను అభినందిస్తూ ఈ సమస్య మన సమాజంలో కళంకంలా మారిందని, ఈ కౄరమైన నేరం గురించి అవగాహన కల్పించడానికి ఈ వేదికను మాధ్యమంగా ఉపయోగించినందుకు ఆయనకు కంగనా కృతజ్ఞతలు చెప్పారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?