పాన్ ఇండియా మూవీ లో ‘సీత’గా కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా ‘తలైవి’ చిత్రంలో నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్రను పోషించింది. అలానే ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్ పై ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. విశేషం ఏమంటే గత కొంతకాలంగా మహాసాధ్వి సీత పాత్రను కంగనా రనౌత్ పోషించబోతోందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే… కంగనా రనౌత్ కోరుతున్న రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేక సీత పాత్రకు వేరే నటిని ఎంపిక చేయబోతున్నారనే వార్తలు సైతం వచ్చాయి. ఈ విషయమే కంగనా రనౌత్ స్పష్టంగా సమాధానం చెప్పకపోయినా, తనకు రెమ్యూనరేషన్ కంటే రెస్పెక్ట్ ప్రధానమని, గౌరవం లభించే ప్రాజెక్ట్స్ ను తాను వదులుకోనని తెలిపింది.
ఇదిలా ఉంటే… తాజాగా అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఎస్.ఎస్. స్టూడియోస్ కు చెందిన సలోని శర్మ నిర్మించబోతున్న ‘ది ఇన్ కారనేషన్ : సీత’ మూవీలో కంగనా రనౌత్ ను ఎంపిక చేసినట్టు ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘తలైవి’కి సైతం ఆయనే కథను అందించడం విశేషం. ‘సీత’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా తానీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సలోని శర్మ తెలిపారు. ఈ సినిమాకు అధికారిక ప్రకటన సందర్భంగా ఓ పోస్టర్ నూ దర్శక నిర్మాతలు విడుదల చేశారు.
Also Read

తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?