Kancharla Chandrasekhar Reddy Joins Congress Party: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ అధికార కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఇక ఈరోజే ఆయనతో పాటు పట్నం సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక వీరంతా పార్టీలో చేరిన తర్వాత అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో ఉన్నా 2014 ఎన్నికల సమయంలో అప్పటి టీఆర్ఎస్ లో చేరారు.
Rakul Preet Singh: డైమండ్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్…
ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ నియోజక వర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ టికెట్ ఆశించినా ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక ఎంపీగా పోటీ చేస్తే అల్లుడు అర్జున్ ప్రచారం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. తన గెలుపునకు ఆయన తప్పకుండా కృషి చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏమి జరగనుంది అనేది.