కమాల్ ఆర్. ఖాన్ ను ఎక్కడైనా చూపించాల్సిందే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని ప్రకటించుకున్న కమాల్ ఆర్. ఖాన్ మొన్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైన సమయంలో బాలీవుడ్ లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాగానే, తట్టుకోలేక పోయాడు. ఎందుకంటే, ‘ట్రిపుల్ ఆర్’ డైరెక్టర్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సిరీస్ ఉత్తరాదిని సైతం ఊపేశాయి. ఆ బాధతోనే కొందరు బాలీవుడ్ బాబులు సాగుతున్నారని వినిపిస్తోంది. అయితే వారందరిలోకి తానే మిన్న అని నిరూపించుకో దలచుకున్నాడేమో కమాల్ ఆర్.ఖాన్ ప్రతీసారి తన కుల్లుబుద్ధి బయట పెట్టుకుంటున్నాడు. సౌత్ , నార్త్ అంటూ తేడాలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగువారిపై విషం చిమ్ముతున్నాడు. ‘ట్రిపుల్ ఆర్’ రిలీజైన రోజునే రాజమౌళిని జైల్లో పెట్టాలనీ అన్నాడు. ఇప్పుడు తాజాగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ గ్రాండ్ సక్సెస్ ను బాలీవుడ్ కు ఆపాదించడం తాను అంగీకరించనని చెబుతున్నాడు.
‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా చిన్న చిత్రంగా వచ్చి, అతి పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో కశ్మీరీ పండిట్స్ పై అప్పట్లో జరిగిన దారుణకాండను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో హిందీనటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి వంటివారు నటించారు. ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి రూపొందించారు. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.330 కోట్లు పోగేసింది. దేశంలోని హిందువులలో అత్యధికులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయించారు. ఇంతలా అలరించిన ఈ చిత్ర విజయాన్ని తాను బాలీవుడ్ కు ఆపాదించనని కె.ఆర్.ఖాన్ చాటింపు వేస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాను సౌత్ కు చెందిన తెలుగు నిర్మాతలు నిర్మించారట! అయ్యగారి బాధ అదన్నమాట! ఈ చిత్ర నిర్మాతల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ కు చెందినవారు. అది అయ్యగారికి నచ్చని అంశం! ఇది కాకుండా లోపల ఇంకా ఏముందో తెలియదు కానీ, ఇతగాడు తెలుగువారు ఏ విజయం సాధించినా తట్టుకోలేక పోతున్నాడు. అయ్యా… బాలీవుడ్ బాబులూ… ఇతగాణ్ణి ఎక్కడన్నా చూపించండి… లేకుంటే, ఈ రోజుల్లోనూ నార్త్, సౌత్ అంటూ విద్వేషాలు రేపేలా ఉన్నాడు.
Also Read
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!