Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా బడ్జెట్ కష్టాలే. నిర్మాణ వ్యయాలు అమాంతం పెరిగిపోయి నిర్మాతలు ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోట్లు పారితోషికం తీసుకునే అగ్ర హీరోలు తమ వంతుగా ఇండస్ట్రీకి ఎలా అండగా నిలవాలి? అనే ప్రశ్నకు ‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్ తన చేతలతోనే అదిరిపోయే సమాధానం చెప్పారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, సంచలనం సృష్టిస్తోంది. స్టార్ డమ్ రాగానే హీరోల ఆలోచనా విధానం, వారి ప్రయాణాలు మారిపోతాయి. ప్రైవేట్ జెట్లు, లగ్జరీ కార్లు, క్యారవాన్లు.. ఇలా వారి హంగు ఆర్భాటాలకే నిర్మాతలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. కానీ, తన నట విశ్వరూపంతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన కమల్ హాసన్ మాత్రం తన స్టార్ హోదాను పక్కనపెట్టేశారు.
తాజాగా ఆయన ‘కల్కి-2’ షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. విలాసవంతమైన ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్‌కు గుడ్‌బై చెప్పి, నేరుగా ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం ఆయన సింప్లిసిటీకి, నిరాడంబరతకు అద్దం పడుతోంది. పరిశ్రమ ఆర్థికంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, సినిమాను బతికించుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతున్న వేళ.. కమల్ హాసన్ వేసిన ఈ అడుగును ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కొనియాడింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. “సినిమా రంగంలో జరగబోయే గొప్ప మార్పుల దిశగా ఇది తొలి అడుగు” అంటూ వైజయంతి మూవీస్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!