Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీల్ హీరో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5న మూవీ విడుదల కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో కమల్ హాసన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘నేను మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తున్నాను. కానీ ఏ రోజు అలసట అనిపించలేదు. నటనపై ఇంట్రెస్ట్, గౌరవం ఇంకా పెరుగుతోంది. నేను నిత్య విద్యార్థిలాగా రోజూ నేర్చుకుంటాను. నా కంపెనీని నడిపించడానికి నేను మలయాళ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు నాకు చాలా ఎక్కువ. కానీ నా సినిమాలు తీయడానికి నాకు డబ్బు కావాలి. అందుకే ఆర్థికంగా బలంగా మారడానికి నాకు డబ్బులు కావాలి.
ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఎం.టీ వాసుదేవన్ నాయర్, మృణాల్ సేన్ లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేయలేకపోయాను. ఆ విషయంలో ఒకింత దురదృష్టవంతుడినేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ప్రతి సినిమాలో మనం ఏంటి అనేది నిరూపించుకోవాలి’ అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్.