Indian 2: ఒకే సినిమాపై పదేళ్లు పని చేయలేం కదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే.. ‘ఇండియన్ 2’ సినిమా ఎప్పుడో రిలీజయ్యేది. కానీ, అలా జరగలేదు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత సెట్స్ విషయంలో ఏదో ఇష్యూ ఏర్పడ్డం వల్ల షూట్ డిలే అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కరోనా వ్యాప్తి వల్ల షూట్ జాప్యమైంది. తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్తే.. క్రేన్ ప్రమాదంతో మళ్లీ ఆగింది.
ఇంతలో శంకర్, నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తడంతో కోర్టు చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వచ్చింది. మళ్లీ కోర్టు తీర్పుతో సమస్యలు తీరిపోయాయి కానీ.. ‘ఇండియన్ 2’ స్టేటస్ ఏంటన్నదే క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఆ మిస్టరీకి తెరదించుతూ.. ఇండియన్ 2 సినిమా ఆగిపోలేదని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. వీలైనంత త్వరగా తాము ఈ సినిమా షూటింగ్ ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
‘‘ఇండియన్ 2 ప్రాజెక్ట్ ఆగిపోలేదు. తప్పకుండా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. చిత్రీకరణ ప్రారంభించిన నాటి నుంచి కరోనా, క్రేన్ యాక్సిడెంట్ వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా షూటింగ్ కొనసాగించాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా వాళ్లతో ఇప్పటికే డిస్కస్ చేయగా, వాళ్లు ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని ఆశగా ఉన్నారు’’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
తనకు, శంకర్‌కు స్వతహాగా నిర్మాణ సంస్థలు ఉన్నాయని.. వాటిని తామే పోషించుకోవాలని.. అందుకే ఇండియన్ 2 విషయంలో ఆలస్యమవుతుండడంతో తాము బయటకు వెళ్లి పని చేయాల్సి వచ్చిందని కమల్ అన్నారు. ఒకే సినిమాపై పదేళ్లు పని చేస్తూ ఉంటే, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..