Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఎటువంటి లీక్స్ లేకుండా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈరోజు ఐఐటీ బాంబే TECH FEST 23 కు నాగ్ అశ్విన్ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే. ఈ మీట్ లో నాగ్ అశ్విన్ కల్కి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పడెప్పుడు ట్రైలర్ వస్తుందా.. ? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మీట్ లో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చాడు నాగీ. కల్కి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని అడగ్గా.. మరో 93 రోజుల తరువాత అని చెప్పుకొచ్చాడు. అంటే ఏప్రిల్ 1 న కల్కి ట్రైలర్ రిలీజ్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఏప్రిల్ 1 అని ఫూల్స్ డే అని చెప్పలేదు కదా. ఆరోజు ట్రైలర్ రిలీజ్ అని హైప్ ఇచ్చి.. ఏప్రిల్ పూల్స్ అని చెప్పరు కదా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే.. ఏప్రిల్ 1 న కల్కి ట్రైలర్ రానుంది. మరి ఇది నిజమవుతుందో లేదో చూడాలి.