Kalki : చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2)కి ఎంపికవగా.. ఉత్తమ చిత్రం(కల్కి) సినిమా ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) ఎంపికయ్యారు. ఇలా కల్కి సినిమాకే రెండు అవార్డులు దక్కాయి. దీంతో కల్కి మూవీ టీమ్ ఈ అవార్డులపై స్పందించింది. ఈ అవార్డులు మా బాధ్యతను మరింత పెంచాయంటూ ప్రకటించింది. దీనిపై మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పందిస్తూ.. తమ చిత్ర బృందాన్ని ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
Read Also : Bhatti Vikramarka : 10 ఏళ్లు వెనుకపడ్డాం.. ఇప్పుడు పరుగులు పెట్టక తప్పదు
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా భారీ హిట్ సాధించింది. ఫ్యూచరిస్టిక్ సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. కలియుగం అంతం నేపథ్యంలో పురాణాలను బేస్ చేసుకుని ఈ సినిమా వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమాతోనే భారీ హిట్ లభించింది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ కు అంతా ఫిదా అయ్యారు. అప్పటి వరకు ఈ స్థాయి సినిమా నాగ్ అశ్విన్ ఎన్నడూ తీయలేదు. కానీ ఈ సినిమాతో తనలోని డైరెక్టర్ ను ఇండియన్ బాక్సాఫీస్ కు పరిచయం చేశాడు. ఈ సినిమాకు పార్ట్-2 కూడా రాబోతోంది. మొదటి పార్టు సినిమాకు, దర్శకుడికి అవార్డు దక్కడంతో మూవీ టీమ్ సంతోషంలో ఉంది.
Read Also : Alleti Maheshwar Reddy : కవిత అసంతృప్తి.. BRS పతనానికి నిదర్శనం