Kajal Pasupathi: కావు నటి కాజల్ పసుపతి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కాజల్ గురించి తెలుగువారికి పరిచయం లేకపోయినా తమిళ తంబీలకు అమ్మడు బాగా ఫేమస్. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగులో అల్లు శిరీష్ డెబ్యూ చిత్రం గౌరవం లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక 2008 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన శాండీ మాస్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు వీరి కాపురం అన్యోన్యంగా నడిచింది. ఆ తరువాత విభేదాల కారణంగా 2012 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడాడు. కానీ, కాజల్ మాత్రం ఒంటారిగానే నివాసముంటూ.. కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడింది.
ఇక నేడు.. కాజల్ తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియా ద్వారా పెళ్లి కూతురుగా ఉన్న ఫోట్ను షేర్ చేస్తూ.. “ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా” అంటూ రాసుకొచ్చింది. అయితే ఆమె భర్తను మాత్రం పరిచయం చేయలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆమె రెండో పెళ్లి చేసుకుందా.. ? లేక ఏదైనా సినిమా కోసం చెప్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.