Kajal Aggarwal’s “Satyabhama” shoot going on at fast pace: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ” అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తుండగా అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ మా “సత్యభామ” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Samantha: రికవరీ కోసం ఆ దారి ఎంచుకున్న సమంత
ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం, ఇటీవలే హైదరాబాద్ లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించామని అన్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నామని పేర్కొన్న ఆయన దీపావళి సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” టీజర్ రిలీజ్ చేస్తామని అన్నారు. వచ్చే సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ “సత్యభామ”గా మిమ్మల్ని ఆకట్టుకుంటారన్నారు. కాజల్ అగర్వాల్ తో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి జి విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.