Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్ చేయడం కోసం జిమ్ లో చాలా కష్టాలు పడుతోంది.
Read Also : HHVM : పవన్ కల్యాణ్ ఎవరి దారిలో నడవడు.. బ్రహ్మానందం కామెంట్స్
తాజాగా జిమ్ లో చెమటలు కక్కుతూ కష్టపడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో చాలా కసరత్తులు చేస్తోంది. ఘాటుగా అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ అందం, అభినయం ఇంత కూడా తగ్గలేదంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్.
Read Also : MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..
