Site icon NTV Telugu

Kajal Aggarwal: బేబీ బంప్ తో చందమామ యోగాసనాలు..

kajal

kajal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్‌ చేస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది.

తాను ఏరోబిక్స్ చేస్తున్న వీడియో ను షేర్ చేస్తూ ” గర్భవతి సమయంలో ఇలాంటి వ్యాయామాలు తల్లిని, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఇంతకుముందు చేసిన ఎక్సర్‌సైజ్‌ల వల్ల, ఇప్పుడు గర్భం దాల్చాక చేస్తున్న వాటి వల్ల ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు చేస్తున్న ఏరోబిక్స్ వలన నాకు అదనపు బలం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ వ్యాయామాలన్నీ అతిగా చేయకూడదు.. అవసరమైనంతవరకే చేయాలి” అని చెప్పుకొచ్చింది. వంగపువ్వు కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో కాజల్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version