ఎంతగానో ఎదురుచూస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.
Read Also : Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!
‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీని తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఖతీజా అనే పాత్రలో సమంత, కన్మణి పాత్రలో నయనతార, విజయ్ రాంబోగా కనిపించబోతున్నారు. “కాతు వాకుల రెండు కాదల్”ను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజ” టైటిల్ తో విడుదల కానుంది.