KA Paul: సూపర్ స్టార్ కృష్ణ చివరి చూపు కోసం అభిమానులు, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. నానక్ రామ గూడలోని కృష్ణ ఇంటివద్దకు ఉదయం నుంచి సినీ రాజకీయ ప్రముఖులు కడసారి కృష్ణను చూడడానికి వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని ఇండస్ట్రీ పెద్దలు, యంగ్ హీరోలు కృష్ణకు నివాళులు అర్పించారు. ఇక మరోపక్క రాజకీయ నేతలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సైతం కృష్ణకు నివాళులు అర్పించి, మహేష్ కు దైర్యం చెప్పారు. తాజాగా కేఏ పాల్.. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కృష్ణ భౌతిక కాయం వద్ద ప్రార్థన చేసి నివాళులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” కృష్ణగారికి, నాకు ఉన్న ఆత్మీయ పరిచయం చాలా గొప్పది. దాదాపు 26 సంవత్సరాల ముందు శాంతి సభకు ఆయన అటెండ్ అయ్యారు. ఆయన కోరిక ఒకటే.. సర్.. మీ శాంతి సందేశాలను ఒక మూవీగా చేద్దామనుకుంటున్నా అని అడిగారు. చెప్పినట్లుగానే శాంతి సందేశంలాంటి మంచి సినిమాను తీశారు. నటులు ఎంతోమంది ఉంటారు కానీ.. శాంతిని కోరే శాంతి దూత కృష్ణ గారు. లోపల ఆయన ఫిజికల్ గా చనిపోయినట్లు లేదు.. ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ ఫర్ అయ్యినట్లే. ఛారిటీ వద్దకు వచ్చినప్పుడు ఆయన చిన్నపిల్లలతో కలిస్ ఆడుకొనేవారు. శాంతి కోసం ఎంతో శ్రమించారు. ఆయన పేరిట ఆయన పిల్లలు ఛారిటీని నడపాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.