K. Raghavendra Rao :’బాబు’ to ‘ఓం నమో వేంకటేశాయ’.. దర్శకేంద్రజాలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది.
కోవెలముడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి కె.యస్.ప్రకాశరావు ఆ రోజుల్లోనే దర్శకనిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన బాణీ పలికించారు. తండ్రి వద్దనే పలు చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన రాఘవేంద్రరావు. డిగ్రీ కాగానే కమలాకర కామేశ్వరరావు వద్ద ‘పాండవవనవాసము’ చిత్రానికి అసోసియేట్ గా చేరారు. ఆపై వి.మధుసూదనరావు వద్ద కూడా అసోసియేట్ గా పనిచేశారు. 1975లో ‘బాబు’ చిత్రం ద్వారా రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ఆ చిత్రంలోనే పాటల చిత్రీకరణలో తనదైన బాణీ పలికించారాయన.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
“అందరు దర్శకులు సీన్ తీయడానికి సినేరియో రాసుకుంటే, రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ కోసమే ఓ స్క్రిప్ట్ రాసుకుంటారు” అని ఆయన సమకాలికులు దాసరి నారాయణరావు సైతం కితాబు నిచ్చారు. అంటే రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణపై అందరికీ ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య ప్రేక్షకుల సంగతి వేరే చెప్పాలా? రాఘవేంద్రరావు చిత్రాలను కేవలం పాటల కోసమే చూసేవారు కొందరు. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా, ఇతర హీరోల అభిమానులు సైతం రాఘవేంద్రరావు చిత్రాలు చూడటానికి ఇదే ప్రధాన కారణమనీ చెప్పక తప్పదు. ఇక రాఘవేంద్రరావు చిత్రాలలో నటిస్తే చాలు స్టార్ డమ్ సొంతమవుతుందని నటీనటులు తపించేవారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాల్లో నటించడానికి ఉరకలు వేసేవారు. వారి అభిలాషకు తగ్గట్టే రాఘవేంద్రరావు తన చిత్రాల్లో నటించే నాయికలను తీర్చిదిద్దేవారు. నాటి మేటి తారలు జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే స్టార్ డమ్ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే! ఇక హీరోల్లోనూ ఎంతోమంది రాఘవేంద్రరావు సినిమాలతోనే మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వెంకటేశ్, మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే కథానాయకులుగా పరిచయమై జనాన్ని అలరించిన తీరును మరచిపోరాదు. యన్టీఆర్ ‘అడవిరాముడు’తో స్టార్ డైరెక్టర్ గా మారిన రాఘవేంద్రరావు, ఆ పై రామారావుతో మరో 11 చిత్రాలు రూపొందించారు. వీటిలో సింహభాగం సూపర్ హిట్స్ కావడం విశేషం! ఇతర స్టార్ హీరోస్ కూ ఆయన బంపర్ హిట్స్ అందించారు.
రాఘవేంద్రరావు సినిమాలు అంటే భారీగానే ఉంటాయని చాలామంది భావిస్తారు. నిజానికి ఆయన అనవసరమైన ఖర్చును ప్రోత్సహించేవారు కారు. తన సినిమాకు ఏది ఎంత అవసరమో అంతే వ్యయం చేయాలని నిర్మాతలకు సూచించేవారు. ఆయన తొలి చిత్రం ‘బాబు’ తరువాత తెరకెక్కించిన “జ్యోతి, కల్పన, ఆమెకథ” వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొందినవే. అయితే వాటిలోనూ తనదైన పాటల చిత్రీకరణతో అలరించారాయన. ‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత రాఘవేంద్రరావుతో భారీ చిత్రాలనే రూపొందించాలని నిర్మాతలు భావించేవారు. అయితే టాప్ స్టార్స్ తో తప్పితే, మిగతా హీరోలతో సినిమాలు తీస్తే మాత్రం భారీ వ్యయాన్ని ఆయన అంగీకరించేవారు కారు. ‘అడవిరాముడు’ తరువాత కూడా “ప్రేమలేఖలు, పదహారేళ్ళ వయసు, రాధాకృష్ణ, నిండు నూరేళ్ళు, నిప్పులాంటి నిజం, సత్యభామ” వంటి చిత్రాలను బడ్జెట్ లోనే తెరకెక్కించారు.
రాఘవేంద్రరావు కీర్తి కిరీటంలో పలు రత్నాలు చోటు చేసుకున్నాయి. “బొబ్బిలిబ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య” చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు. ఇప్పటి దాకా దర్శకుల్లో నాలుగు సార్లు నంది అవార్డును అందుకున్న ఘనత రాఘవేంద్రరావుదే! ‘పెళ్ళిసందడి’తో బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ నందిని అందుకోవడం విశేషం. 2009లో బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికిగాను ఆయనకు యన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు. ఇక “ప్రేమలేఖలు, జగదేకవీరుడు – అతిలోకసుందరి, అల్లరిప్రియుడు, అన్నమయ్య” చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో రూపొందించిన ‘పెళ్ళిసందD’లో రాఘవేంద్రరావు నటునిగానూ కనిపించారు. ఎనభై రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న రాఘవేంద్రరావు మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!