టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అందం, అభినయం మాత్రమే కాకుండా ఆరోగ్య సూత్రాల వల్ల కూడా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మయోసైటిస్ అనే తీవ్రమైన వ్యాధిని జయించి, ఇప్పుడు మరింత ఫిట్‌గా, హెల్తీగా జీవనశైలిని కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్‌కు పేరుగాంచిన సమంతకు రోజూ వ్యాయామం తప్పనిసరి. కొత్త కొత్త వర్కౌట్స్, యోగా పద్ధతులను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె పరిచయం చేసిన “క్లియర్ క్రియేటిన్” వ్యాయామం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వ్యాయామం వల్ల కేవలం కండరాలకే కాకుండా మెదడు, ఎముకలు, ఓర్పు అన్నీ బలపడతాయని సమంత చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తాను దీన్ని తన దినచర్యలో ప్రధాన భాగంగా మార్చుకున్నానని, దీనివల్ల తాను బరువులు సులభంగా ఎత్తగలగడం, త్వరగా కోలుకోవడం, రోజంతా ఫోకస్‌గా ఉండగలగడం సాధ్యమవుతోందని చెప్పుకొచ్చారు.
Also Rad : OG : పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటీ కన్ఫర్మా..!
అదేవిధంగా, సమంత తనకు అవసరమైన సప్లిమెంట్ల జాబితాను కూడా పంచుకున్నారు.. విటమిన్ D3 + K2 – ఎముకల ఆరోగ్యం, గుండె నాళాలకు మద్దతుగా ఉంటుంది. ఒమేగా-3 (EPA & DHA) – మెదడు, హృదయ ఆరోగ్యానికి తోడు. ఆల్గేకాల్ – మొక్కల ఆధారిత కాల్షియం, ఎముక సాంద్రత పెంచుతుంది. బోరాన్ – హార్మోన్ల సమతుల్యత, ఖనిజ జీవక్రియకు తోడ్పడుతుంది. జింక్ – రోగనిరోధక శక్తి, కణజాల మరమ్మత్తుకు తోడ్పడుతుంది. కొలొస్ట్రం – గట్ ఆరోగ్యం, ఇమ్యూనిటీ మెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తాను కొవ్వులు ఉన్న ఆహారంతో పాటు తీసుకుంటానని, శరీర అవసరాలను బట్టి సప్లిమెంట్ల వాడకం వ్యక్తివ్యక్తికి వేరుగా ఉంటుందని కూడా వివరించారు. మొత్తానికి, సమంత కొత్త ఫిట్‌నెస్ టిప్స్, సప్లిమెంట్స్ లిస్ట్ యూత్‌కు కొత్త ప్రేరణగా మారాయి. తన లైఫ్‌స్టైల్‌తో ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మరోసారి నిరూపించారు.