RRR: ఇదెక్కడి క్రేజ్ రా మావా… మన ‘నాటు’ పాట BTSని చేరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, నాటు నాటు పాట ఇంపాక్ట్ మన దేశ సరిహద్దులు దాటి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎపిక్ మూవీ ఇండియన్ ఆడియన్స్ తో పాటు జపాన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఒక ఇండియన్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే చెల్లింది. ఈ మూవీ అంత రీచ్ రావడానికి ముఖ్యమైన కారణం నాటు నాటు పాట. ఈ పాట వైబ్ కి ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. మార్చ్ 12న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుస్తుంది అనే నమ్మకం మన కన్నా వెస్ట్రన్ ఆడియన్స్ కి ఎక్కువగా ఉందంటే నాటు నాటు పాట రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ పక్కా ఊర మాస్ నాటు సాంగ్ రేంజుని మరింత పెంచుతూ వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజిక్ టీం అయిన BTSని కూడా మెప్పించింది.
BTS సభ్యుడు, సింగర్, లిరిసిస్ట్ అయిన వరల్డ్ ఫేమస్ ‘జంగ్కూక్’ నాటు నాటు సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘జంగ్కూక్’ ఇన్స్టాగ్రామ్ ని వదిలేసినా తర్వాత… BTS యొక్క మాక్నే Weverseలో లైవ్ లోకి వస్తూ ఫాన్స్ కి కనెక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగా మార్చ్ 2న లైవ్ లో ‘జంగ్కూక్’ తన సాంగ్స్ ప్లే లిస్ట్ ని ఆడియన్స్ ని వినిపిస్తూ మధ్యలో ‘నాటు నాటు’ సాంగ్ ని ప్లే చేశాడు. ‘జంగ్కూక్’ మన పాటని వినడమే కాదు లిరిక్స్ ని హమ్ చేస్తూ, మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ‘జంగ్కూక్’ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. “మీకు ఈ పాట తెలుసా?” అని ఒక ఫ్యాన్ అడగగా… “ఇది ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనిది… ఈ పాట చాలా బాగుంది” అంటూ ‘జంగ్కూక్’ రిప్లై ఇచ్చాడు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రస్తుతం BTS హోల్డ్ లో ఉంది. సౌత్ కొరియా చట్టాల ప్రకారం అక్కడి ప్రతి పౌరుడు ఆర్మీలో చేరి కొన్ని నెలల పాటు దేశ రక్షణలో భాగం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా 2025 వరకూ BTS నుంచి కొత్త ఆల్బమ్ బయటకి వచ్చే అవకాశం లేదు. గత పదేళ్లలోనే టాప్ మోస్ట్ ఆల్బమ్స్ ఇస్తూ వరల్డ్ బిగ్గెస్ట్ టీమ్స్ లో ఒకటిగా నిలిచినా BTS ఒక ఇండియన్ సాంగ్ వైబ్ ని ఎంజాయ్ చెయ్యడం గొప్ప విషయం. ప్రపంచంలో ఉన్న BTS ఆర్మీ మొత్తం ‘జంగ్కూక్’ మన పాటని వినీ ఎంజాయ్ చేసిన వీడియోని చూసి థ్రిల్ అవుతున్నారు.
JUNGKOOK….❤️🔥❤️🔥❤️🔥
It's amazing to know that you loved #NaatuNaatu so much.🕺🕺
We are sending a ton of love to you, the #BTS team, and the whole of South Korea.🤗🤗 #RRRMovie pic.twitter.com/ktAEfc56xB
— RRR Movie (@RRRMovie) March 3, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!