NTR: తన తల్లి శాలినితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపించాడు. ఇక తాజాగా తన తల్లితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి అంక్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Also Read: Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు
నాతో చేరి దీన్ని సాధ్యం చేసినందుకు విజయ్ కిరగందూర్ సర్ మరియు నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్‌కి ధన్యవాదాలు, నా ప్రియమైన స్నేహితుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు, ఈ విషయంలో ఆయన ప్రెజెన్స్ అండ్ సపోర్ట్ ఈ మూమెంట్ ను చాలా ప్రత్యేకంగా చేసింది అని పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూట్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన సినిమా షూట్ లో బిజీ కానున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ , ఆయన సన్నిహిత హోంబాలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ హెల్ప్ తోనే ఉడిపిలో మంచి దర్శనం జరిగిందని ఎన్టీఆర్ పేర్కొనడం గమనార్హం.