Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు
- సినిమా చెట్టుకు మళ్ళీ చిగుర్లు
- రసాయనాలతో చెట్టును మళ్ళీ చిగురింపచేసే యత్నం
- ఫలించిన యత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదారి గట్టుంది, గట్టు మీద సినిమా చెట్టు ఉంది.. అయితే ఆ చెట్టు కూలిపోయింది. ఇంతవరకు మీకు తెలుసు.. కానీ ఇప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తోంది. అవును ఆశ్చర్యం అనిపించినా అది నిజమే అండోయ్. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా సినిమాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు మహా వృక్షానికి పునర్ జన్మ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండు వైపులా ఉన్న కొమ్మల బరువుతో, వేర్ల దగ్గర గోదారి కోతతో ఈ చెట్టు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. చెట్టు వేళ్లతో సహా కూలిపోతే దానికి మళ్లీ పునరుజ్జీవనం పోవయడం కష్టం కానీ ఆ చెట్టు కూలిపోయినా వేర్లు ఇంకా భూమిలో బ్రతికే ఉన్నాయి కాబట్టి అది మళ్లీ చిగిర్చే అవకాశం ఉందని ఆ మేరకు ప్రయత్నాలు చేశారు.
Also Read: Subrahmanyaa: సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే?
Also Read
దాన్ని నిలబెడితే ఓ చరిత్ర నిలబడుతుందని ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు చిగురు మళ్ళీ మొలకెత్తింది. కొన్నాళ్ల క్రితం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చెట్టుకు కొన్ని రసాయనాలతో ట్రీట్మెంట్ చేశారు. 50 రోజుల్లో చెట్టుకి చిగుర్లు వస్తాయని భావించగా అవి నెల రోజుల్లోనే రావడంతో గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ చెట్టు కుమారదేవం గ్రామస్తులకు మూడుపూటల భోజనం పెట్టిందని అంటూ ఉంటారు. ఈ చెట్టు దగ్గర సినిమా షూటింగ్‌లు జరిగితే కుమారదేవం గ్రామస్తులకు ఉపాధి దొరికేదని స్థానికులు చెబుతున్నారు. ఈ చెట్టు కూలిపోవడంతో ఇంట్లో మనిషిని కోల్పోయినంత బాధగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కూలిపోయిన చెట్టుకు మళ్లీ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ స్థానికులు పూజాలు చేయడంతో అన్నీ ఫలించి మళ్ళీ చిగురించింది.
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!