Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరోలైనా తమకు నచ్చిన దర్శకులు, సంగీత దర్శకులతో ఎంతో చనువుగా ఉంటారు. అలాంటి సరదా ముచ్చటే ఇప్పుడు బయటకు వచ్చి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్లకు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఫోన్ చేసి ఫన్నీగా క్లాస్ పీకిన సంగతిని తాజాగా తమన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో తమన్ కొన్ని గుండెల్ని పిండేసే ఎమోషనల్ పాటలు ఇచ్చారు. కట్ చేస్తే.. ఆ వెంటనే అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం ‘సామజవరగమనా’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ లాంటి అదిరిపోయే రొమాంటిక్, డాన్స్ నంబర్లు కంపోజ్ చేశారు. ఆ పాటలు బయటకు వచ్చి సూపర్ హిట్ కాగానే తారక్ వెంటనే త్రివిక్రమ్, తమన్లకు ఫోన్ చేశారట. “మాకేంట్రా ఏడబోయినాడో, ఎప్పుడు వస్తాడో లాంటి పాటలిచ్చారు.. బన్నీకి వచ్చేసరికి అలాంటి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చేశారా?” అంటూ తనదైన స్టైల్లో సరదాగా వాళ్లిద్దరిని నిలదీశారని తమన్ గుర్తు చేసుకున్నారు.
Also Read
- KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
- Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
- Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
- CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
అంతేకాదు, “నాకేమో ఎండలో నిలబెట్టి, నెత్తిమీద దుమ్ము పోసి, చొక్కాలు విప్పించి, చెమటలు కక్కించారు.. బన్నీకి అలాంటి సూపర్ హిట్ పాటలా” అంటూ తారక్ సరదాగా వేసిన పంచ్‌లను పక్కనే ఉన్న త్రివిక్రమ్ కూడా గుర్తు చేసుకుని పగలబడి నవ్వారు. తారక్‌కు ఇప్పటికీ తమపై ఆ విషయంలో చిన్న సరదా కోపం ఉందని తమన్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ స్టార్స్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్