KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF 3: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ప్రాంచైజీకి మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని సినిమా ప్రేమికులు, ముఖ్యంగా యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని తేలిపోయింది.
‘కేజీఎఫ్ 2’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ప్రశాంత్ నీల్ ఆ సినిమా మూడో భాగాన్ని పక్కనపెట్టి, ప్రభాస్‌తో ‘సలార్’ పూర్తి చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ షూటింగ్‌ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే యశ్‌తో కలిసి ‘కేజీఎఫ్ 3’ మొదలుపెడతారని ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్ 2’పై ప్రశాంత్ నీల్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ‘సలార్ 2’ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు నీల్ ప్రకటించడంతో.. ఆయన డైరీలో ‘కేజీఎఫ్ 3’కి ఇప్పట్లో చోటు లేదని స్పష్టమైంది.
Also Read
- Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
- Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
- Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
- CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
మరోవైపు ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ ప్లానింగ్ కాస్త మిస్సయ్యిందనే టాక్ వినిపిస్తోంది. సరైన స్పీడ్‌తో సినిమాలు చేయకుండా, దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమాను పట్టాలెక్కించారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకయినా ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘కేజీఎఫ్ 3’ చేస్తారనుకుంటే.. నీల్ లైనప్‌లో ఎన్టీఆర్ సినిమా, ఆ వెంటనే ‘సలార్ 2’ ఫిక్స్ అయిపోయాయి. దీంతో రాకీ భాయ్ మూడో భాగం పూర్తిగా అటకెక్కినట్టేనని సినీ వర్గాల్లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమా వచ్చినా, అది మరో నాలుగైదేళ్ల తర్వాతే ఉండే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్