Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్‌కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
- విడుదలకు సిద్ధమైన లెనిన్ చిత్రం
- భారీ అంచనాలు పెట్టుకున్న అఖిల్
- లెనిన్ కోసం రంగంలోకి ఎన్టీఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR to Promote Akhil’s Lenin Movie: అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది. ముఖ్యంగా ‘ఏజెంట్’ తర్వాత అఖిల్‌కు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ కావడంతో ప్రమోషన్స్‌ను కూడా వినూత్నంగా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారనే ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల విడుదలైన ‘లెనిన్’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచినప్పటికీ.. ఆశించిన స్థాయిలో హైప్ మాత్రం ఇంకా రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో విడుదలకు ముందు సినిమాపై మరింత బజ్ తీసుకురావడానికి మేకర్స్ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఎన్టీఆర్‌తో అఖిల్‌కు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినీ ప్రయాణం గురించి ఆసక్తికరంగా మాట్లాడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
నిజానికి ఎన్టీఆర్, అఖిల్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహబంధం ఉంది. వ్యక్తిగతంగానే కాకుండా సినీ పరిశ్రమలో కూడా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. మరోవైపు ‘లెనిన్’ చిత్రాన్ని నాగార్జునతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించారు. నాగార్జున, నాగవంశీలతో కూడా ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉండటంతో.. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకు ఆయన అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూ విడుదలైతే ‘లెనిన్’ సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ ఏర్పడడం ఖాయం. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు అఖిల్ అభిమానుల్లోనూ ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వచించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ‘ఏజెంట్’ పరాజయం తర్వాత అఖిల్ ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ‘లెనిన్’పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ నిజమైతే.. డ్రాగన్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఎన్టీఆర్ అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!