బుడ్డోడు బుల్లితెర మీదకి తిరిగి వచ్చేస్తున్నాడు! ఎస్… ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్! జెమినీ టీవీలో తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిర్వహించబోతోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజాగా ప్రారంభ తేదీల్ని ప్రకటించారు నిర్వాహకులు. ఆగస్ట్ 22 నుంచీ జూనియర్ తన ఫ్యాన్స్ ని ఇంటింటా అలరించనున్నాడు.
ఆగస్ట్ 22న కర్టెన్ రైజర్ ఉంటుందట. ఆగస్ట్ 23 నుంచీ రాత్రి 8.30 గంటలకి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం అవుతుంది. సోమవారం నుంచీ గురువారం దాకా వరుసగా నాలుగు రోజులు ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ‘ఇక్కడ మనీనే కాదు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు’ అంటున్నాడు తారక్!
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభ తేదీల్ని ప్రకటిస్తూ జెమీనీ టీవీ తాజాగా ఓ ప్రోమో విడుదల చేసింది. స్వయంగా ఎన్టీఆర్ ‘మీ ఇంటికి వస్తున్నా’నంటూ బిగ్ అనౌన్స్ మెంట్ చేశాడు…