Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లిమ్స్ వీడియో ఏకంగా నాలుగు నిమిషాల 35 సెకండ్ల లెన్త్ (రన్ టైం)తో రాబోతోంది. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ కూడా ఈ నిడివితో ఉండదు. కానీ, కేవలం గ్లిమ్స్ కోసమే ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ రన్ టైం ప్లాన్ చేయడం ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం ‘సలార్’ సినిమా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అప్పట్లో సలార్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా విడుదలయ్యాక అందులోని పాత్రలు, తెగలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురయ్యారు. అందుకే ఇప్పుడు డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
లెంతీ గ్లిమ్స్ ద్వారా తను సృష్టించిన డ్రాగన్ ప్రపంచాన్ని, అందులోని పాత్రలను ముందే ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఇలా చేయడం వల్ల సినిమా కథపై ఆడియన్స్ ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు; కథలో కన్ఫ్యూజన్ ఉండదు. పైగా, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గడంతో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ మరియు లుక్ పై అభిమానుల్లో కొంత అనుమానాలు ఉన్నాయి. అది కూడా ఈ గ్లిమ్స్ ద్వారా క్లియర్ కానుంది. మొత్తంగా డ్రాగన్ పై ఉన్న డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఏదేమైనా ఈ గ్లిమ్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేయడం గ్యారెంటీ. మరి ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి వరల్డ్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..