Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్‌లో ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’కి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరు ‘LUGER’ అని చిత్ర బృందం విడుదల చేసిన చిన్న గ్లింప్స్ ద్వారా లీక్ అవ్వడంతో, ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఈ ‘లూగర్’ అనే పేరు వెనుక ఉన్న మర్మమేంటి? దర్శకుడు ఈ పేరునే ఎందుకు ఎంచుకున్నాడు? అనే కోణంలో అభిమానులు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
గూగుల్ సమాచారం ప్రకారం.. ‘LUGER’ అనేది ఒక సాధారణ పేరు కాదు. ఇది జర్మనీకి చెందిన అత్యంత శక్తివంతమైన 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్ (తుపాకీ) పేరు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మన్ సైనికులు దీనిని తమ ప్రామాణిక సర్వీస్ పిస్టల్గా ఉపయోగించేవారు. ఎంతో ఖచ్చితత్వం, గురి తప్పని నమ్మకానికి ఈ లూగర్ పిస్టల్స్ అప్పట్లో పెట్టింది పేరు. ఎన్టీఆర్ పాత్ర కూడా శత్రువుల గుండెల్లో బుల్లెట్లా దూసుకుపోయేలా, ఎంతో పవర్‌ఫుల్‌గా, డైనమిక్‌గా ఉండబోతోందని చెప్పడానికే దర్శకుడు ఈ పేరును డిజైన్ చేసి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయుధాల పేరును క్యారెక్టర్లకు పెట్టడం వెనుక ఏదైనా బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా కథకు, ఈ పేరుకు ఉన్న అసలు లింక్ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?