Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్, చుట్టమల్లే సాంగ్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ మధ్యలో..’ఆ..’ అంటూ అనిరుధ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అది ఇది అని కాదు.. ఏ ఈవెంట్ తీసుకున్న సరే.. ‘ఆ.. ‘అంటూ ఆడిటోరియం దద్దరిల్లిపోతోంది. అయితే.. మెలోడి సాంగ్‌కే ఇలా ఉంటే.. మరి మాస్ సాంగ్ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే.. కొరటాల శివ దేవరను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు. అందులోను.. ఓ ట్రైబల్ తెగ నాయకుడు, కాపరి అని అంటున్నారు. అది పోను.. కారంచేడు ఊచకోత సంఘటన కూడా ఈ సినిమాలో కీ పాయింట్‌గా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
Mahesh Vs Pawan: ‘గబ్బర్ సింగ్’ను కొట్టేలా ఏడాది ముందు నుంచే ప్లానింగ్?
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
అలాంటి.. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్ బాక్సులు బద్దలవుతాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాలో ఆయుధ పూజ సాంగ్‌కు అంతా పోతారని మేకర్స్ చెబుతున్నారు. కానీ అంతకంటే ముందే.. మాస్ ఫెస్ట్ లాంటి మాస్ వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన దావుడా మాస్ బీట్.. ఫియర్, చుట్టమల్లే సాంగ్‌కు మించి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్టే విజువల్ పరంగా చాలా కలర్ ఫుల్‌గా ఉంది ఈ సాంగ్. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ అయితే.. విజిల్స్‌కే మోత పెట్టించేలా ఉంది. జాన్వీ మాస్ రేంజ్ గ్లామర్ తో పాటు ఆమె వేసిన స్టెప్పులు కూడా పాటకే హైలెట్ అనే చెప్పాలి. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. థియేటర్లో ఈ సాంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను సీట్లో కూర్చోకుండా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మొత్తంగా అనిరుధ్ మాత్రం.. టైగర్ ఫ్యాన్స్‌కు మాస్ ఫెస్ట్ ఇస్తున్నాడనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 27న దేవర ఏం చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!