Jaya Prada: బ్రేకింగ్.. నటి జయప్రద మిస్సింగ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaya Prada: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్ట్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికీ ఈ కేసు కోర్టు లో నడుస్తోంది. ఇప్పటివరకు కూడా జయప్రద విచారణ కొరకు కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసు నవంబర్ 8 న విచారణకు వచ్చింది. అప్పుడు జయప్రద హాజరుకాకపోవడంతో నవంబర్ 17 కు వాయిదా వేశారు. అప్పటికే జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
ఇక నవంబర్ 17 న కూడా ఆమె కోర్టుకు రాకపోయేసరికి డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇక ఇన్నిసార్లు కోర్టు సమయాన్ని వృథా చేయడంతో ఆమెపై కోర్టు ఫైర్ అయ్యింది. జనవరి 10 లోపు జయప్రదను తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆజ్ఞాపించింది. ఇక కోర్టు వారి ఆదేశంతో పోలీసులు.. వెంటనే ఆమె నివాసానికి వెళ్లగా అక్కడ ఆమె మిస్సింగ్. దీంతో జయప్రద కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీఎవరికి తెలియరాలేదు. అస్సలు జయప్రద ఎక్కడుంది..? ఎవరితో ఉంది.. ?అనేది మిస్టరీగా మారింది. ఆమె కోసం పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!