Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Jarkiholi: కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, గందరగోళం జరగలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోలి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఈ ప్రక్రియపై స్పందిస్తూ, తన వ్యాఖ్యలతో ఆయన ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని కుండబద్ధలు కొట్టారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా కర్ణాటకలో దాదాపు కోటి మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై వెలువడిన వార్తలపై మంత్రి స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేనని ఆయన సమర్థించారు. తొలగించిన పేర్లలో మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, అలాగే ఒకరి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన (డూప్లికేట్) ఓటర్లు మాత్రమే ఉన్నారని వివరించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కుకూ భంగం కలగలేదని, బోగస్ ఓట్లను ఏరివేసేందుకే ఈ చర్యలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
అయితే, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తమ వ్యతిరేకత కర్ణాటకకు సంబంధించింది కాదని మంత్రి స్పష్టం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను అమలు చేసిన తీరుపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో ముందుగానే నిరసనలు తెలపడం, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వల్ల ఇక్కడ సవరణలు సక్రమంగా పూర్తయ్యాయని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో పకడ్బందీగా, పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, ఓటర్ల జాబితా ప్రక్షాళన అనే విధానం మంచిదే అయినప్పటికీ, దాన్ని అమలు చేసే తీరు సరిగ్గా ఉండాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని సతీష్ జార్కిహోలి తేల్చిచెప్పారు.
Also Read
- Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!